![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న బిబి జోడికి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు బిబి జోడి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ప్రతి వారం డిఫరెంట్ థీమ్ తో వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్న బిబి జోడి.. ఈ వారం రెట్రో స్పెషల్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. ప్రతి జోడి నువ్వా, నేనా అన్నట్టుగా పోటీపడుతూ డ్యాన్స్ చేసారు.
శనివారం జరిగిన ఎపిసోడ్ నుండి ఒక జోడి, ఆదివారం జరిగిన ఎపిసోడ్ నుండి మరొక జోడి లీస్ట్ లో ఉన్నారు. మెహబూబ్ -శ్రీ సత్య జోడి, కౌశల్ -అభినయశ్రీ జోడి లీస్ట్ లో ఉన్నారు. ప్రతీవారం ఇలా లీస్ట్ లో ఉన్న జోడిలకి.. వన్ మినిట్ టైం ఇచ్చి డ్యాన్స్ చేయమని చెప్తారు. ఆ రెండూ జోడీలు చేసాక అందులో నుండి బాగా చేయనివాళ్ళని ఎలిమినేటెడ్ జోడిగా , బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన వారు సేఫ్ జోడి గా జడ్జెస్ డిసైడ్ చేసేవారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ అలా కాకుండా కౌశల్-అభినయశ్రీని డైరెక్ట్ ఎలిమినేషన్ చేసారు. వాళ్ళిద్దరు స్టేజి మీదకి వస్తున్నప్పుడు.. కౌశల్ ని పట్టుకొని అభినయశ్రీ రావడం చూసిన జడ్జెస్ ఏమైందని అడుగుతారు. "ప్రాక్టీస్ లో అభినయశ్రీ కాలుకి గాయం అయింది.. అయినా కూడా తను నొప్పి భరిస్తూ చేస్తానని చెప్పింది" అని కౌశల్ చెప్పాడు. అలా నొప్పితో డాన్స్ చెయ్యడం వద్దు అని రాధ అంటుంది. మెహబూబ్ కూడా సోలోగా రెండు వారాలు చేసాడు కదా మేడమ్.. నేను కూడా అలాగే చేస్తానని కౌశల్ అనగా.. ఇది బిబి జోడి.. జోడిగానే డాన్స్ చెయ్యాలని జడ్జెస్ చెప్తారు. దానికి ఇద్దరు సరే అంటారు.
అభినయశ్రీ- కౌశల్ షో నుండి ఎలిమినేట్ అని అనగానే.. "లేదు మేము వాకౌట్" అని కౌశల్ అంటాడు. అది విని రాధ కోప్పడుతుంది. "ఏ విషయాన్నయినా స్పోర్టివ్ గా తీసుకోవాలి" అని కౌశల్ ని ఉద్దేశించి రాధ అంటుంది. పక్కనే ఉన్న అభినయశ్రీ.. "మీ డెసిషన్ ని ఏకీభవిస్తున్నాం మేడమ్" అని చెప్తుంది. దీంతో అభినయశ్రీ-కౌశల్ జోడి పోటీ నుండి తప్పుకున్నారు. ఇక ఎలిమినేట్ అయి బయటికొచ్చిన కౌశల్.. "జడ్జెస్ స్ట్రాటజీస్ వాడుతున్నారు.. అందుకే రవికిరణ్ -భాను ఎలిమినేట్ అయ్యారు. లేదంటే వాళ్ళు టాప్-2 లో ఉండేవాళ్ళు" అని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
![]() |
![]() |